Bigg Boss-7: వాడికి ఏం చెప్పినా అర్థం కాదు.. శివాజీ ఆన్సర్‌కి నాగార్జున షాక్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7.. ఈ సారి అదిరిపోయే రేటింగ్‌తో దూసుకుపోతుంది.

Update: 2023-10-07 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7.. ఈ సారి అదిరిపోయే రేటింగ్‌తో దూసుకుపోతుంది. గత రెండు, మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ రేటింగ్ పడిపోవడంతో.. ఈసారి ఉల్టా పుల్టా గేమ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినట్లుగానే ఈ సీజన్‌ మొత్తం ఉల్టా పుల్టాతో అదిరిపోయే ట్విస్ట్‌లు ఇస్తూ ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్‌లో ఐదు వారాలు ఒక ఎత్తు అయితే.. శనివారం నాగార్జున ఎపిసోడ్ మరో ఎత్తు. సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌస్‌లో కంటెస్టెంట్స్ చేసిన ఒక్కో తప్పుని సవరిస్తూ ఈసారి నాగార్జున కూడా తన ప్రతాపాన్ని బాగానే చూపిస్తున్నాడు. ఇక ఈ వారం కూడా హౌస్ మేట్స్‌ను ఓ రేంజ్‌లో వేసుకున్నాడు నాగార్జున. ఇక ఈ రోజు ప్రోమో-2 విషయానికి వస్తే..

స్టార్టింగ్‌లోనే శోభాశెట్టిపై సీరియస్ అయ్యారు. తను తీసుకున్న నిర్ణయం కారణంగా తన బడ్డి కూడా గేమ్ ఓడిపోవాల్సి వచ్చిందని క్లాస్ తీసుకున్నాడు. ఇక తర్వాత గౌతమ్‌పై కూడా సీరీయస్ అయ్యాడు. తర్వాత శివాజీని ఫ్రూట్ నింజా టాస్క్ గురించి ప్రశ్నిస్తూ.. ‘ప్రశాంత్ ఓ పక్క నుంచి చెప్తూనే ఉన్నాడు. అన్న తొక్కలు వేశారు అని. వదిలేయ్‌రా అని ఎలా అంటావ్ శివాజీ’ అని అడిగాడు నాగార్జునా. దీనికి శివాజీ మాట్లాడుతూ.. ప్రతి దానికి గొడవ పెట్టుకుంటే నాతోని కాదు సర్. పైగా తొక్కలు వెయ్యడం చూడలేదు. పక్క నుంచి తీయడం చూశాను అని చెప్తాడు. అయితే సంచాలక్ అమర్ దీప్‌కి చెప్పొచ్చు కదా అని నాగ్ అనగా.. ‘అబ్బే అమర్‌కి ఏం చెప్పిన వినడు సర్. డే వన్ నుంచి వాడొక నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ప్రస్తుతం ఈ ప్రోమో హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

Tags:    

Similar News