‘రతిక చిన్న పిల్లా.. అది బర్రెపిల్ల.. బయటకు వెళ్లాక చంపేస్తా..’ పల్లవి ప్రశాంత్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించిన రతిక నాలుగో వారానికే ఇంటిబాట పట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించిన రతిక నాలుగో వారానికే ఇంటిబాట పట్టింది. హౌస్‌లో అందరితో గొడవలకు దిగటం, అతి కోసంతోనే రతికను బయటకు పంపించినట్లు టాక్ నడుస్తోంది. అయితే రతిక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినా హౌస్‌లో ఉన్నవారిని ఇంకా డిస్ట్రబ్ చేస్తుందట. హౌస్‌లో రతికతో లవ్ ట్రాక్ నడిపిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆమెను మర్చిపోలేకపోతున్నామని తాజా ఎపిసోడ్లో బయటపెట్టాడు. ఈ డిస్కషన్‌ను మొత్తం స్వయంగా రతిక తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా పోస్ట్ పెట్టింది. ఇంతకూ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..
పల్లవి ప్రశాంత్ : అన్నా.. నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చింది అన్న.. అసలు నిద్ర పట్టలేదు.
శివాజీ: నాకు గుర్తుకు వచ్చింది కానీ ఏమ్ చేస్తామ్ రా? అది చిన్న పిల్ల..
ప్రశాంత్: అది చిన్న పిల్ల ఏంది అన్నా.. బర్రె పిల్ల. మస్తు కోపం వచ్చింది.
శివాజీ: బయటకు వెళ్ళాక కలుద్దాం లేరా.. నువ్వు బాధ పడకు.. నాకు అర్థం అయింది నీ ఆవేదన.
ప్రశాంత్: రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్న దానిని.. నా మీద ఎందుకు అన్నా అంత కోపం.. నేను ఏం తప్పు చేశాను? నన్ను నామినేట్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడినా.. అయినా నన్ను నమ్మలేదు తను.
శివాజీ: చిన్న పిల్లరా అది వదిలేయ్..
ప్రశాంత్: నన్ను కలవదు అన్నా రతిక.. బయటకు పోయాక..
ఈ సంభాషణ మొత్తం శివాజీ, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగినట్టు రతిక పోస్ట్ చేసింది. అయితే దీనిపై రతిక స్పందిస్తూ.. తాను కూడా పల్లవి ప్రశాంత్, శివాజీలను మిస్ అవుతున్నానంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం రతిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు వీరిద్దరు నిజంగానే లవ్‌లో ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు.