‘‘అన్నా రతికను మర్చిపోలేక పోతున్న.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు’’ శివాజీతో ఓపెన్ అయిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ రియాలిటీ షో స్టార్ట్ అయి ఐదో వారం కొనసాగుతుంది. హౌస్‌లో జరిగే టాస్క్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాలిటీ షో స్టార్ట్ అయి ఐదో వారం కొనసాగుతుంది. హౌస్‌లో జరిగే టాస్క్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. అయితే ఎప్పటిలాగానే ఈ సారి కూడా లవ్ ట్రాక్స్ నడిచాయి. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ ల జోడీ బిగ్‌బాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆటలో భాగమేనని కొద్ది రోజులకే అర్థమైపోయింది. తనతో ఎంతో క్లోజ్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడిచింది రతిక. ఆ తర్వాత ప్రిన్స్ యావర్‌తో చనువుగా ఉంది. నాలుగో వారంలోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంటూ హౌజ్‌ను వీడింది. అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి రతిక బయటకు వెళ్లిపోయినా ఆమెను మర్చిపోలేకపోతున్నాడు రైతు బిడ్డ. తాజాగా, ప్రసారమైన ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్, రతిక గురించి హౌస్మెట్ శివాజీకి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘అన్నా.. నేను రతికను మర్చిపోలేక పోతున్నాను. రాత్రిళ్లు కూడా బాగా గుర్తుకు వస్తుంది. నిద్ర కూడా రావడం లేదు.’’ అంటూ శివాజీ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి రతిక.. రైతు బిడ్డను ప్రేమ పిచ్చోడిని చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.