శారీరకంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. అతడిపై బిగ్ బాస్‌కు శోభా, రతిక కంప్లైంట్

ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్.

Update: 2023-09-29 08:05 GMT
శారీరకంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. అతడిపై బిగ్ బాస్‌కు శోభా, రతిక కంప్లైంట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్-7 స్టార్ట్ అయి నాలుగు వారాలు అవుతుంది. అయితే రోజు రోజుకు టాస్క్‌లతో ప్రసారమవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.

తాజాగా, ఓ కంటెస్టెంట్ అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు లేడీస్ బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేశారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ, శోభా శెట్టితో చాలెంజ్ చేశాడు. దీనికామె నువ్వు ఏం రౌండ్‌లో అయినా బజార్ కొడితే.. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అంటుంది. అప్పుడు అతడు ఓ టాస్క్‌లో ఓడిపోయి ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చమని ఒక హగ్ ఇవ్వమని డైరెక్ట్‌గా అడిగాడట. ఈ విషయాన్ని శోభా బయటపెట్టి షాకిచ్చింది. అసభ్యంగా ప్రవర్తించాడు: అక్కడితో ఆగని శోభా శెట్టి 'బిగ్ బాస్ చూడండి. ఓదార్చమని హగ్ ఇవ్వమని అడుగుతున్నాడు. నన్ను ఫిజికల్ అబ్యూస్ (శారీరకంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నన్నే కాదు.. రతికను కూడా హగ్ ఇవ్వమని బలవంతం చేశాడు' అని కంప్లైంట్ చేసింది. దీంతో అక్కడే ఉన్న రతికా కూడా పూరీలు చేసే కర్ర తీసుకుని వచ్చి టేస్టీ తేజను కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో తేజ ఇన్ని కెమెరాలు ఉండగా నేనే చేస్తాను బిగ్‌బాస్. నేను అభాగ్యుడిని మాత్రమే వీళ్లు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్తాడు. ఇదంతా సరదాగా జరిగినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీని గురించి తెలిసిన వారు బిగ్‌బాస్ షోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Tags:    

Similar News