Big Boss Telugu 7: బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటి సారి.. టేస్టీ తేజాకు నాగార్జున విధించిన శిక్షలు ఏంటో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా మారింది.

Update: 2023-10-01 06:10 GMT

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా మారింది. ఉల్టా పుల్టా అంటూ సరికొత్త టాస్కులు, గొడవలు, రొమాన్స్, ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన యాంగిల్స్‌ను చూపిస్తూ ఒక రేంజ్లో దూసుకెళ్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో టేస్టీ తేజకు, నాగ్ బిగ్ బాస్ చరిత్రలోనే సరి కొత్త శిక్షను విధించాడు. దాని గురించి ఇక్కడ చూద్దాం..

టాస్క్ సమయంలో టేస్టీ తేజ.. గౌతమ్ కృష్ణను బెల్టుతో కొట్టిన విషయం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ ఘటన పై స్పందించాడు. ముందుగా బెల్ట్ పట్టుకుని స్టేజ్‌ మీదకు వచ్చిన.. టేస్టీ తేజాను వాయించేసాడు.

టేస్టీ తేజ కావాలనే గౌతమ్ కృష్ణను కొట్టినట్లు నాకు అనిపించిందన్న నాగార్జున.. ఇంట్లో ఉన్న వాళ్ల అభిప్రాయం తీసుకున్నాడు. ఫైనల్ గా టేస్టీ తేజకు ఏ శిక్షను విధించాలని ప్రతి ఒక్కరినీ అడిగాడు. వారిలో కొందరు వారికి తోచిందని చెప్పారు. వారు చెప్పిన దాని బట్టి తేజకు జైలు శిక్షను విధిస్తున్నట్లు చెప్పాడు. అదే సమయంలో జైలులో ఉన్నా గౌతమ్ కృష్ణ చెప్పిన ప్రతి పనినీ చేయాల్సి ఉంటుందని అన్నాడు. అలాగే ఐదో వారానికి కూడా నామినేట్ చేసాడు. ఒకేసారి జైలు, నామినేషన్‌కు వచ్చిన కంటెస్టెంట్‌గా అతడు నిలిచాడు.

Tags:    

Similar News