‘‘బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలి’’.. నేరుగా సుప్రీంకోర్టుకు CPI నారాయణ విజ్ఞప్తి
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో యువతను తప్పుదారి పట్టించేలా ఉందని.. ఈ కార్యక్రమంలోని
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో యువతను తప్పుదారి పట్టించేలా ఉందని.. ఈ కార్యక్రమంలోని సన్నివేశాలు నైతిక విలువలను నాశనం చేసేవిగా ఉన్నాయని ఆరోపించారు. అందువల్ల ఈ షో అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన నేపథ్యంలో మంగళవరం ఓ వీడియోను రిలీజ్ చేసిన నారాయణ.. బిగ్ బాస్ సంస్కృతి బీజేపీ సంస్కృతి ఒక్కటేనా అని ప్రశ్నించారు.
అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బిగ్ బాస్‌పై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదని.. కోర్టులను ఆశ్రయించినా బిగ్ బాస్ షో జోలికి పోవడం లేదన్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు శక్తివంతులు కావడం వల్లే దీని జోలికి ఎవరూ వెళ్లడం లేదని ఆరోపించారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమాజాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాగా బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని నారాయణ గతంలోనూ అనేక సార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.