బిగ్ బాస్ షో వేస్ట్.. అదొక చెత్త కాన్సెప్ట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున (వీడియో)
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆశక్తికంగా సాగుతోంది. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆశక్తికంగా సాగుతోంది. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్స్, టాస్క్‌లు, గొడవలు ఓ ఎత్తు అయితే.. శనివారం, ఆదివారం నాగార్జున ఎపిసోడ్ మరో ఎత్తు. శనివారం ఎపిసోడ్లో హౌస్ మేట్స్‌పై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో.. ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతార అని బిగ్ బాస్ లవర్స్ ఆ రెండు ఎపిసోడ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పుడు రన్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 కు కూడా నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. అలాంటి వ్యక్తి.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అక్కినేని నాగార్జున, నేచులర్ స్టార్ నాని కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘దేవదాస్’. టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2018, సెప్టెంబర్ 27న రిలీజైంది. అయితే.. ఆ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు.. బిగ్ బాస్ చూస్తున్నారా..? అని నాగార్జునను యాంకర్ ప్రశ్నించింది. దానికి నాగార్జున స్పందిస్తూ.. ‘బిగ్ బాస్ గురించి వద్దులే నేను బ్యాడ్‌గా మాట్లాడతాను. నాకు అసలు ఆ షో కాన్సెప్ట్ నచ్చదు. పక్కనోడు ఏం చేస్తున్నాడు అని చూడటం.. దానిపై మాట్లాడటం అదొక హింస’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘గత ఐదు సీజన్లుగా నువ్వే చేస్తున్నావు... ఇష్టం లేనప్పుడు ఎందుకు హోస్ట్‌గా చేయడం రెమ్యునరేషన్ కోసమా’’ అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు నెటిజన్లు.