బిగ్ బాస్ సీజన్-7: డబల్ ఎలిమినేషన్లో ఇద్దరు బ్యూటీలు ఔట్
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం చివరి దశకు చేరుకోవడంతో నాగార్జున ఎపిసోడ్ గురించి బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే శుక్రవారం జరిగిన కొన్ని అనివార్య కారణాలు చేత ప్రోమో చాలా లేట్‌గా వదిలారు మేకర్స్. ఈ ప్రోమోలో మొదట పల్లవి ప్రశాంత్‌పై హోస్ట్ నాగార్జున సీరియస్ అయ్యాడు. ఘోస్ట్‌గా ఉన్న సమయంలో అశ్వినిపై ప్రశాంత్ ఏదో వల్గర్ కామెంట్ చేశాడు. దాని గురించి ప్రశ్నించాడు నాగ్.
ఇక అశ్వినీ విషయానికి వస్తే.. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిసి కూడా అశ్విని సెల్ఫ్ నామినేట్ అయింది. దీనిపై కూడా నాగార్జున ఫైర్ అయ్యాడు. అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్లో ఈ రోజు ఎపిసోడ్లో అశ్విని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక రెండో ఎలిమినేషన్ రేపు జరుగనుండగా.. అందిన సమాచారం మేరకు రతిక కూడా ఎలిమినేట్ అయిందని సమాచారం. కాగా.. బిగ్ బాస్ సీజన్ 7 లో మూడు వారాలు ఉన్న రతిక తన తెలివి తక్కువ స్ట్రాటజీతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయి నాలుగోవారమే ఇంటి నుంచి బయటకు వచ్చింది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక.. నెక్స్ట్ వీక్ నేనేంటో చూపిస్తా.. నెక్ట్స్ వీక్ నేనోంటో చూపిస్తా అనుకుంటూ గేమ్‌లో తనేంటో నిరుపించుకోలేక పోయింది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయింది రతిక.