నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ భార్య

స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోన్న బిగ్‌బాస్ సీజన్-7 ప్రస్తుతం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్‌‌తో ముందుగు దూసుకెళ్తోంది.

Update: 2023-10-15 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోన్న బిగ్‌బాస్ సీజన్-7 ప్రస్తుతం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్‌‌తో ముందుగు దూసుకెళ్తోంది. అయితే హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో ఫస్ట్ నుంచి స్ట్రాంగ్‌గా అనిపించినా.. టాప్ -3లో ఒకరు సందీప్. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సందీస్ యాక్టింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడు. అలాగే ప్రతీ వీక్ నాగార్జునతో క్లాస్ తీసుకునే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లలో సందీప్ తప్పకుండా ఉంటాడు. అయితే సంచాలక్‌గా విఫలం అయినప్పుడు నాగ్ సందీప్‌ను.. చెత్త సంచాలక్, నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా? అన్న మాటలకు తాజాగా సందీప్ భార్య జ్యోతి స్పందించింది. నాగార్జున ఏ రేంజ్ వ్యక్తో నాకు తెలుసు.

అయినప్పటికీ నా భర్తను అన్ని మాటలు అనేస్తాడా? నా భర్త నాకు గొప్ప, అలా తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అనిపించింది. కానీ ఒక్కసారి నాగార్జున గారి బోనులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలి. ఎన్ని మాటలు అన్నా కూడా పడాలి తప్పదు. సందీప్‌ను తిట్టిన ఆయనే మళ్ళీ అతడ్ని మెచ్చుకున్నాడు. పరిశ్రమలో తిట్లు తిట్టుంచుకోవడం కామన్. ఇక అన్ని భరించాలి. అప్పుడే గొప్ప స్థాయికి వస్తాం.’’ అంటూ సందీప్ భార్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News