Bigg Boss-7: షాకింగ్ ట్విస్ట్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా?

తెలుగు బిగ్‌బాస్-7 షో చాలా ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ నిత్యం పలు టాస్క్‌లను ఇస్తూ ప్రేక్షకుల్లో షోపై అంచనాలను పెంచుతున్నారు.

Update: 2023-10-07 07:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్-7 షో చాలా ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ నిత్యం పలు టాస్క్‌లను ఇస్తూ ప్రేక్షకుల్లో షోపై అంచనాలను పెంచుతున్నారు. అయితే ఇది స్టార్ట్ అయి నాలుగు వారాలు పూర్తయి ఐదో వారం ప్రసారమవుతుంది. వరుసగా నాలుగు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ మినహా ఐదో వారం నామినేషన్స్‌లో గౌతమ్, యావర్, శుభశ్రీ, తేజ, ప్రియాంక అమర్ దీప్, ప్రియాంక ఉన్నారు.

తాజాగా, నిన్న శుక్రవారం ప్రసారమైన తర్వాత ఓటింగ్ లిస్ట్ బయటకు వచ్చేసింది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మళ్లీ లేడీ కంటెస్టెంట్ అని వార్తలు వస్తున్నాయి . టాప్‌లో శివాజీ ఉండగా.. తర్వాత స్థానాల్లో గౌతమ్, యావర్, శుభశ్రీ, టేస్టీ తేజ, అమర్, ప్రియాంక ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న క్రమంలో అమర్‌కు ఓట్ల శాతం పెరిగిందట. దీంతో ఈ వారం ప్రియాంకనే ఎలిమినేట్ కాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారో తెలియాలంటే ఇంకా ఆదివారం బిగ్‌బాస్ షో వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News