Bigg Boss-7: శోభా శెట్టిని ఘోరంగా ఏడిపించిన బిగ్ బాస్.. మిగిలిన ముగ్గురిని కూడా విడిచిపెట్టలేదుగా..

బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకుల అంచనాలు మించి ఎంటర్టైన్ చేస్తుంది.

Update: 2023-09-21 15:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకుల అంచనాలు మించి ఎంటర్టైన్ చేస్తుంది. 14 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ అయిన షో.. ఇద్దరు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఇక పవర్ అస్త్ర సొంతం చేసుకుని సందీప్, శివాజీ సేఫ్ జోన్‌లో ఉన్నారు. మిగిలిన వారిలో పల్లవి ప్రశాంత్ మినహా మిగిలిన అందరూ నామినేషన్‌లో ఉన్నారు. ఇక వారం పవర్ అస్త్ర సొంతం చేసుకునేందుకు అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ పోటీ పడనున్నారు. అయితే.. ఈ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్ర సొంతం చేసుకునేందుకు అనర్హులు అని బిగ్ బాస్ మిగిలిన కంటెస్టెంట్స్‌ను కన్ఫెషన్ రూమ్‌లో చెప్పమంటారు.

ఈ క్రమంలో శోభా శెట్టి అనర్హురాలు అని గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ చెప్పారు. ఇక తనను తాను అర్హురాలు అనిపించుకునేందుకు బిగ్ బాస్ శోభా శెట్టికి ‘కారంగా ఉన్న చికెన్’ తినాలని టాస్క్ ఇస్తాడు. అది తినలేక శోభా భోరున ఏడుస్తుంది. అదే విధంగా.. అదే టాస్క్ శోభా అనర్హురాలు అని చెప్పిన ముగ్గురుకి ఇస్తాడు. వారు కూడా ఆ చికెన్ తినేందుకు ప్రయత్నించగా.. శుభశ్రీ తినలేక మధ్యలోనే వెళ్లిపోతుంది. దీంతో.. పవర్ అస్త్ర సాధించే దిశలో ఎవరు గెలుపొందుతారో అనేది ఉత్కంఠంగా మారింది.

Tags:    

Similar News