ప్రియాంకను దారుణంగా ర్యాగింగ్ చేసిన భోలే.. పాపం కన్నీరు ఒక్కటే తక్కువ..! (వీడియో)

బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురు అయింది.

Update: 2023-10-16 15:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురు అయింది. హౌస్ మేట్స్ మధ్య వార్ మాములుగా లేదని ప్రోమో చూస్తేనే అర్థం అయిపోతుంది. హౌస్‌‌లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని భావిస్తారో వారిని నామినేట్ చేసి.. వారి ముందు కుండ పెట్టి బ్యాట్‌తో బద్దలు కొట్టాలని చెప్తాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే హౌస్ మేట్స్ వారి కారణాలను చెప్పే క్రమంలో హౌస్ హీట్ వాతావరణం నెలకొంది. ఇక తేజ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయడానికి వెళ్లడంతో.. ‘‘రారారా.. వెయిటింగ్’’ అంటూ ప్రశాంత్ ఫైర్ అవుతాడు.

ఇదంతా పక్కన పెడితే.. ప్రియంక, భోలే మధ్య మాటలు హౌస్‌లో నవ్వులు పూయిస్తాయి. ప్రియాంక భోలేను నామినేట్ చేయగా.. ‘‘రారా రారా.. నామినేషన్స్ వేసుకో’’ అంటూ ఎగతాళిగా ప్రియాంకను ర్యాగింగ్ చేసినట్లు చేస్తాడు భోలే. దీంతో ప్రియాంకకు చాలా కోపం వస్తుంది. ఆ టైంలో ప్రియాంక ముఖం చూస్తే ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లుగా కనిపిస్తుంది. అయితే.. ఎవరెవరో నామినేట్ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Tags:    

Similar News