మజాకులు చేయడానికి నేను ఎవర్రా బయ్ నీకు.. ఇట్లా ఇట్లా చూపించినప్పుడు లేదా.. రతిక ప్రశాంత్ మధ్య హోరాహోరీ ఫైట్

ప్రస్తుతం బిగ్ బాస్-7 ప్రేక్షకుల అంచనాలకు మించి రసవత్తరంగా దూసుకుపోతుంది.

Update: 2023-09-26 15:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బిగ్ బాస్-7 ప్రేక్షకుల అంచనాలకు మించి రసవత్తరంగా దూసుకుపోతుంది. ఈ వారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. సోమవారం నామినేషన్లు షురూ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే నామినేషన్‌లో హౌస్ మేట్స్ మధ్య హోరా హోరీ గొడవలు షురూ అయ్యాయి. ఇక ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్.. గౌతమ్‌ని నామినేట్ చేస్తూ ‘‘అమ్మాయి అరిచినప్పుడు నువ్వు అరు. కానీ అలా షర్ట్ విప్పడం నాకు నచ్చలేదు’’ అని అంటాడు. దానికి గౌతమ్ ‘‘నువ్వు రతికను ఏంటీ ఈ పొట్టి పొట్టి బట్టలు’’ అని అన్నావ్ అంటాడు. అయితే.. నేను దోస్తాలో అన్నా అని ప్రశాంత్ అనగా.. నేను ఏం బట్టలు వేసుకుంటే నీకు ఎందుకు అంటూ రతిక పల్లవి ప్రశాంత్‌పై సీరియస్ అయింది. మరి నువ్వు నా దగ్గరకు వచ్చి గిట్ల గిట్ల అని ఎందుకు చూపించావు అంటూ ప్రశాంత్ సీరియస్ అవుతాడు. ఇలా వీరిద్దరి డిష్‌కర్షన్ అవుతుండగా.. నా ప్రోపర్టీ అని ఎందుకు అన్నావని రతిక ప్రశాంత్‌ని అనగా.. ఏదో మజాక్‌లో అన్నా అంటాడు. దీంతో నాతో మజాక్‌లు చేయడానికి నేను ఎవర్ర బయ్ నీకు అంటూ ప్రశాంత్‌పై వీర లెవల్లో సీరియస్ అవుతుంది రతిక. దీనికి సంబంధించిన ప్రోమో రసవత్తరంగా వైరల్ అవుతోంది.

Tags:    

Similar News