నోయల్ ఆరోగ్యంపై బిగ్‌బాస్ టీం క్లారిటీ!
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-4వ సీజన్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తున్నారు. టీం సభ్యుల సెలక్షన్ పై చాలా మంది బహిరంగంగానే అయిష్టత కనబరిచారు. దాంతో ఈసారి బిగ్‌బాస్ షోకు ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కాగా, అది కాస్త ఇపుడు ఆసక్తిగా మారుతోంది. గొడవలు, అల్లర్లు, ఏడుపులు, డ్యాన్స్ లతో హౌస్ మేట్స్ హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్‌హౌస్ నుంచి అనారోగ్యంతో గంగవ్వ బయటకు వచ్చేసింది. ఇపుడు అదే బాటలో మరో కంటెస్టెంట్ కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-4వ సీజన్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తున్నారు. టీం సభ్యుల సెలక్షన్ పై చాలా మంది బహిరంగంగానే అయిష్టత కనబరిచారు. దాంతో ఈసారి బిగ్‌బాస్ షోకు ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కాగా, అది కాస్త ఇపుడు ఆసక్తిగా మారుతోంది. గొడవలు, అల్లర్లు, ఏడుపులు, డ్యాన్స్ లతో హౌస్ మేట్స్ హోరెత్తిస్తున్నారు.
ఇప్పటికే బిగ్ బాస్‌హౌస్ నుంచి అనారోగ్యంతో గంగవ్వ బయటకు వచ్చేసింది. ఇపుడు అదే బాటలో మరో కంటెస్టెంట్ కూడా బయటకు రానున్నట్లు తెలుస్తోంది. అతను అనారోగ్యానికి గురికావడానికి ‘కరోనా వైరస్’ కారణమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు అతనెవరంటే.. సింగర్ నోయల్. గత కొద్దిరోజులుగా నోయల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా సోకడం వల్లే నోయల్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే నోయల్ అనారోగ్యంపై బిగ్‌బాస్ టీం క్లారిటీ ఇచ్చింది. నోయల్‌కు కరోనా పాజిటివ్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది. కానీ, ఇతర ఆరోగ్య సమస్యలతో అతను బాధపడుతున్నాడని.. అందువల్లే కొద్ది రోజులు అతడిని బయటకు తీసుకురానున్నట్లు బిగ్‌బాస్ నిర్వహకులు పేర్కొన్నారు. నోయల్ ఆరోగ్యం త్వరగా కుదుట పడితే, రెండు నుంచి మూడు రోజుల్లోనే అతడు తిరిగి షోలో పాల్గొంటాడని తెలిపారు.