ఏపీలో అద్భుతం.. టోర్నడో ఆవిష్కృతం
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం వద్ద సముద్రంలో రిలయన్స్ రింగుకి సమీపంలో సముద్రంలో టోర్నడో ఏర్పడింది. దీంతో నీరు సముద్రం నుంచి ఆకాశంలోకి వెళ్తున్న దృశ్యం ఆవిష్కృతమైంది. దీనిని తొలిసారిగా వీక్షించిన స్థానిక మత్స్యకారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో ఏర్పడే టోర్నడోలను ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని భైరవపాలెం […]
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం వద్ద సముద్రంలో రిలయన్స్ రింగుకి సమీపంలో సముద్రంలో టోర్నడో ఏర్పడింది. దీంతో నీరు సముద్రం నుంచి ఆకాశంలోకి వెళ్తున్న దృశ్యం ఆవిష్కృతమైంది. దీనిని తొలిసారిగా వీక్షించిన స్థానిక మత్స్యకారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో ఏర్పడే టోర్నడోలను ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని భైరవపాలెం మత్యకారులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.