హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు భారీ షాక్..
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టిని సారించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీణవంక మండలంలో ఓ వైపున మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసుల లక్ష్మణ్ రావులు పర్యటిస్తుండగానే మండలంలోని 13 గ్రామాల ఉప సర్పంచ్‌లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాము ఈటల […]
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టిని సారించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వీణవంక మండలంలో ఓ వైపున మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసుల లక్ష్మణ్ రావులు పర్యటిస్తుండగానే మండలంలోని 13 గ్రామాల ఉప సర్పంచ్‌లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాము ఈటల రాజేందర్ పక్షానే ఉంటామని.. రానున్న ఎన్నికల్లో ఈటల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈటలను ఒంటరి చేయాలన్న కుట్రతో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సెంటిమెంట్‌గా కలిసొచ్చే కరీంనగర్ నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని, ఈటల విజయంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు.