బీజేపీలో శువేందు అధికారి?
కోల్‌కతా: వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల మంత్రి పదవి నుంచి వైదొలిగిన శువేందు అధికారి బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చేవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పశ్చిమబెంగాల్ పర్యటన నేపథ్యంలో ఆయన సమక్షంలో శువేందు అధికారి బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్‌లో పశ్చిమ ప్రాంతంలో దాదాపు […]
కోల్‌కతా: వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల మంత్రి పదవి నుంచి వైదొలిగిన శువేందు అధికారి బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చేవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పశ్చిమబెంగాల్ పర్యటన నేపథ్యంలో ఆయన సమక్షంలో శువేందు అధికారి బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్‌లో పశ్చిమ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీట్లలో ప్రాబల్యం చూపగల శువేందు అధికారి వైదొలగడం తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో తృణమూల్‌ను వీడిన రెండో నేత శువేందు అధికారి. అంతకుముందు అసన్‌సోల్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ పదవి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.