‘రేటు హైక్.. ఆడేద్దాం పీక్’
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తన బాధ్యత పెరిగిందని, ధర ఎక్కువ పెట్టినప్పుడు దానికి తగినట్లుగానే రాణించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ అన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడటంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిన్స్.. ఆ జట్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐపీఎల్ 13వ సీజన్‌కు జరిగిన వేలంలో కమిన్స్‌ను రూ. 15.5 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. దీంతో ఈ […]
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తన బాధ్యత పెరిగిందని, ధర ఎక్కువ పెట్టినప్పుడు దానికి తగినట్లుగానే రాణించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ అన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడటంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిన్స్.. ఆ జట్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐపీఎల్ 13వ సీజన్‌కు జరిగిన వేలంలో కమిన్స్‌ను రూ. 15.5 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. దీంతో ఈ సీజన్‌లో అత్యంత విలువైన ప్లేయర్‌గా కమిన్స్ నిలిచాడు. కాగా, ఈ విషయంపై కమిన్స్ పలు విషయాలు వెల్లడించాడు. ‘తాను కేకేఆర్ టీంలో సెలెక్ట్ కావడానికి కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కారణం, అతనికి చాలా రుణపడి ఉంటాను. నన్ను కేకేఆర్‌లో ఎంపిక చేసినందకు ఆ జట్టు సిబ్బందికి కొన్నిసార్లయినా పార్టీ ఇస్తాను’ అని కమిన్స్ అన్నాడు. కోల్‌కతా జట్టు నాపై అంత నమ్మకం ఉంచడం చాలా గొప్పగా అనిపించిందని అన్నాడు.
ఐపీఎల్‌లో ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం అంటే.. చాలా గొప్ప బాధ్యతలు మోయడమే అని కమిన్స్ అన్నాడు. ఐపీఎల్‌లో బరిలోకి దిగిన తర్వాత ఏ ఆటగాడు కాంట్రాక్టుల గురించి ఆలోచించడని.. జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఆడతాడని కమిన్స్ చెప్పాడు. ఐపీఎల్ ప్రస్తుతానికి వాయిదా పడటం తనను చాలా నిరుత్సాహపరిచిందని.. కానీ త్వరలోనే టోర్నీ ప్రారంభం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.