సినీ కార్మికులను ఆదుకున్న తెలుగు ఇండస్ట్రీకి బిగ్ బి అభినందన
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమా ఇండస్ట్రీని అభినందించారు. కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకోవడాన్ని ప్రశంసించారు. తనవంతు సహాయంగా కార్మికులకు 12000 కూపన్లు ఇచ్చారు. ఒక్కో కూపన్ విలువ రూ. 1500 ఉండగా… బిగ్ బజార్ లో వీటిని ఉపయోగించవచ్చు. కాగా బిగ్ బి సహాయం విలువ రూ. 1.8 కోట్లు ఉంది. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి సీనియర్ బచ్చన్ కి థాంక్స్ చెప్పారు. చిత్ర పరిశ్రమను ఒకే కుటుంబంగా భావించి […]
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమా ఇండస్ట్రీని అభినందించారు. కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకోవడాన్ని ప్రశంసించారు. తనవంతు సహాయంగా కార్మికులకు 12000 కూపన్లు ఇచ్చారు. ఒక్కో కూపన్ విలువ రూ. 1500 ఉండగా… బిగ్ బజార్ లో వీటిని ఉపయోగించవచ్చు. కాగా బిగ్ బి సహాయం విలువ రూ. 1.8 కోట్లు ఉంది. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి సీనియర్ బచ్చన్ కి థాంక్స్ చెప్పారు. చిత్ర పరిశ్రమను ఒకే కుటుంబంగా భావించి సాయం చేసిన బచ్చన్ కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు చిరు.
T 3504 – I understand #CoronaCrisisCharity was set up with @KChirutweets ( chiranjeevi) as chairman to aid (cont) https://t.co/y84NpZiauS
— Amitabh Bachchan (@SrBachchan) April 17, 2020
ఈ ట్వీట్ పై స్పందించిన అమితాబ్ … తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరు ఆధ్వర్యంలో సిసిసి ఏర్పాటు చేసి… రూ. 8 కోట్ల మేర విరాళాలు కలెక్ట్ చేయడం అభినందనీయం అన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకున్న నటీనటులను సైతం అభినందించిన ఆయన… కష్టాల్లో ఉన్న కార్మికులకు నెలకు పైగా రోజువారీ సరుకులు అందించడం చాలా మంచి ప్రయత్నం అన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు బిగ్ బి.
Tags : Big B, Amitabh Bachchan, Chiranjeevi, Bollywood, CCC, Tollywood, Corona, CoronaVirus, Covid 19
Slug :