హెచ్-1బీ వీసాలు పెంచే యోచనలో బైడెన్
వాషింగ్టన్: అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విదేశీ నిపుణులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను బైడెన్ ప్రభుత్వం సవరించే యోచన చేస్తున్నది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలు పెంచాలని, గ్రీన్ కార్డులనూ పెంచాలని ఆలోచిస్తున్నట్టు బైడెన్ క్యాంపెయిన్ విడుదల చేసిన పాలసీ డాక్యమెంటు వివరిస్తున్నది. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకూ వర్క్ పర్మిట్లు అనుమతించాలని పేర్కొంది. దీంతో భారత నిపుణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. భారతీయ ప్రొఫెనషల్స్‌కు ఈ నిర్ణయాలు కలిసొస్తాయి. అమెరికన్ల నియామకాలను ఆపడానికి ఉన్నత నిపుణుల […]
వాషింగ్టన్: అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విదేశీ నిపుణులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను బైడెన్ ప్రభుత్వం సవరించే యోచన చేస్తున్నది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలు పెంచాలని, గ్రీన్ కార్డులనూ పెంచాలని ఆలోచిస్తున్నట్టు బైడెన్ క్యాంపెయిన్ విడుదల చేసిన పాలసీ డాక్యమెంటు వివరిస్తున్నది. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకూ వర్క్ పర్మిట్లు అనుమతించాలని పేర్కొంది.
దీంతో భారత నిపుణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. భారతీయ ప్రొఫెనషల్స్‌కు ఈ నిర్ణయాలు కలిసొస్తాయి. అమెరికన్ల నియామకాలను ఆపడానికి ఉన్నత నిపుణుల వీసాలను వినియోగించడానికి సరికాదని బైడెన్ అభిప్రాయం. ప్రాథమిక స్థాయి వేతనాలు, నైపుణ్యాలకు మాత్రమే విదేశీయులను పరిమితం చేస్తే అమెరికా సృజనాత్మకత, పోటీతత్వం సన్నగిల్లుతుందని తెలిపారు. అందుకే హెచ్-1బీ సహా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ సంఖ్యను పెంచాలని బైడెన్ బృందం భావిస్తున్నది.
అలాగే, ఎంప్లాయిమెంట్ బేస్డ్ వీసాలు లేదా గ్రీన్ కార్డుల జారీపైనా ఆంక్షలు సడలించాలనుకుంటున్నది. దేశంలో లేబర్ మార్కెట్, నిపుణుల కొరత అంచనాలతో సంబంధం లేకుండా వీసాలపై ఆంక్షల విధింపులు జరిగాయి. ప్రస్తుతం ఏడాదికి గ్రీన్ కార్డుల జారీ సంఖ్యను 1.40లక్షలకు మాత్రమే పరిమితం చేశారు. అమెరికా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటి సంఖ్యను పెంచడానికి బైడెన్ బృందం పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొంది. దేశంలో నిరుద్యోగిత గరిష్టాలకు చేరినప్పుడు వీసాల జారీని తగ్గించే మెకానిజం కోసం కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతామని వివరించింది.