‘క్లైమేట్ యాక్షన్ ప్రాజెక్ట్’ లాంచ్ ప్లాన్‌లో భూమి

దిశ, వెబ్‌‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ టాలెంట్ ఉన్న నటి మాత్రమే కాదు.. పర్యావరణం, సమాజం గురించి ఆలోచించే బాధ్యతగల పౌరురాలు. కొన్ని నెలలుగా ప్రకృతి, పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది భూమి. ఈ క్రమంలోనే క్లైమేట్ వారియర్ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చింది. పర్యావరణాన్ని రక్షించుకునేందుకు భారతీయులు చేయాల్సిన పనుల గురించి వివరించింది. బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. కాగా, ఇప్పుడు క్లైమేట్ యాక్షన్ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాజెక్ట్‌లో […]

Update: 2020-09-26 03:14 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ టాలెంట్ ఉన్న నటి మాత్రమే కాదు.. పర్యావరణం, సమాజం గురించి ఆలోచించే బాధ్యతగల పౌరురాలు. కొన్ని నెలలుగా ప్రకృతి, పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది భూమి. ఈ క్రమంలోనే క్లైమేట్ వారియర్ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చింది. పర్యావరణాన్ని రక్షించుకునేందుకు భారతీయులు చేయాల్సిన పనుల గురించి వివరించింది. బాధ్యతగా వ్యవహరించాలని కోరింది.

కాగా, ఇప్పుడు క్లైమేట్ యాక్షన్ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాజెక్ట్‌లో భాగంగా వాతావరణం గురించి జరిగే చర్చ, సంభాషణలో స్కూల్ విద్యార్థులను భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 107 దేశాల్లోని 10 మిలియన్ విద్యార్థులకు రీచ్ కానుంది. కాగా, ఆస్ట్రేలియాలో 18 మిలియన్ హెక్టార్ల అడవి కాలిపోవడం వల్ల బిలియన్ జంతువులు అగ్నికి ఆహుతి కావడం, రష్యాలో చమురు చిమ్మడం, ఉత్తరాఖండ్‌లో అటవీ సంపద కాలిపోవడం, అంఫన్ తుఫాన్ లాంటి విపత్తులు పునరావృతం కాకుండా ఉండాలటే జాగ్రత్తలు ముఖ్యమని చెప్పింది. అందుకే విద్యార్థులు ముందుకొచ్చి వాతావరణ మార్పులపై చర్చించాలని.. అవగాహన కల్పించాలని భూమొ పెడ్నేకర్ కోరింది.

క్లైమేట్ యాక్షన్ ప్రాజెక్ట్‌.. 15 దేశ ప్రభుత్వాల ఆమోదం పొందగా, అక్టోబర్‌లో లాంచ్ కానుంది. డబ్లూడబ్లూఎఫ్, నాసా సహకారంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక ఖండానికి చెందిన టీచర్, విద్యార్థులు.. ప్రతీ ఖండానికి చెందిన వారితో వాతావరణ మార్పులపై సంభాషించే అవకాశం అవకాశం ఉంది.

Tags:    

Similar News