నెలాఖరు వరకు భీమవరం బంద్
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేఫథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు. కూరగాయలు, కిరణా షాపులు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారని, మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 6.00 నుంచి 10. గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారని తెలిపారు. ఇక పాల […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేఫథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు. కూరగాయలు, కిరణా షాపులు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారని, మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 6.00 నుంచి 10. గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారని తెలిపారు. ఇక పాల కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షాపులు తెరచి ఉంచుతారు. మెడికల్ షాపులన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరచి ఉంచుతారు. ఇతర కార్యకలాపాలన్నీ బంద్ కానున్నాయి. ఆంక్షలను మీరితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.