మధిరలో పాదయాత్ర.. టీఆర్ఎస్ కండ్లు తెరిపిస్తానన్న భట్టి విక్రమార్క
దిశ, చింతకాని: ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న టీఆర్ఎస్ సర్కారు కండ్లు తెరిపించేందుకు జనవరి 9 నుంచి మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ పాలకుల చీడ నుంచి తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని వెల్లడించారు. మధిర నియోజకవర్గం, చింతకాని మండలం నరిసింహపురం గ్రామంలో జరిగిన మండల కాంగ్రెస్ ప్లినరీ సమావేశానికి ఆయన […]
దిశ, చింతకాని: ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న టీఆర్ఎస్ సర్కారు కండ్లు తెరిపించేందుకు జనవరి 9 నుంచి మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ పాలకుల చీడ నుంచి తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని వెల్లడించారు. మధిర నియోజకవర్గం, చింతకాని మండలం నరిసింహపురం గ్రామంలో జరిగిన మండల కాంగ్రెస్ ప్లినరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోలేక ఆత్మహత్యలకు పాల్పడటమే.. కేసీఆర్ చేస్తున్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణం ఇదేనా అని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు చేయలేని సత్తా లేని సర్కారు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి సర్కార్ ఖజానాను నిలువు దోపిడీ చేస్తున్న గులాబీ పాలకుల పీడను తెలంగాణ ప్రజలకు దూరం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కార్మోనుముఖులు కావాలని భట్టి పిలుపునిచ్చారు.