Airtel :సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను ప్రకటించిన ఎయిర్‌టెల్

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌, వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతున్న నేపథ్యంలో డేటా వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం దేశీయ దిగ్గజ టెలికాం సస్థ ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను గురువారం ప్రకటించింది. కార్పొరేట్ కస్టమర్లతో పాటు రిటైల్ వినియోగదారులకు వేర్వేరుగా ఈ ప్లాంట్ ఉంటాయని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల నుంచి తీసుకున్న సలహాలకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్‌లను రూపొందించామని, కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన విధానంలో […]

Update: 2021-07-22 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌, వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతున్న నేపథ్యంలో డేటా వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం దేశీయ దిగ్గజ టెలికాం సస్థ ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను గురువారం ప్రకటించింది. కార్పొరేట్ కస్టమర్లతో పాటు రిటైల్ వినియోగదారులకు వేర్వేరుగా ఈ ప్లాంట్ ఉంటాయని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల నుంచి తీసుకున్న సలహాలకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్‌లను రూపొందించామని, కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన విధానంలో ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా సేవలందించనున్నట్టు ఎయిర్‌టెల్ వివరించింది.

కార్పొరేట్ వినియోగదారులకు రూ. 299 నుంచి రూ. 1,599 మధ్య మొత్తం ఐదు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, గూగుల్ వర్క్‌స్పేస్ లాంటి బిజినెస్ టూల్స్‌ను యాక్సెస్ చేయవచ్చని, ఇంకా ఇతర సౌకర్యాలు అందిస్తున్నట్టు వివరించింది. రిటైల్ కస్టమర్ల కోసం రూ. 399 నుంచి రూ. 1,599 మధ్య ఐదు రకాల యాడ్-ఆన్స్ ప్లాన్‌లను ప్రకటించింది. అయితే, కొత్త కస్టమర్లకు రూ. 749 తో ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తొలగించింది. దీనికి బదులుగా అదనపు ప్రయోజనాలతో రూ. 999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందించనున్నట్టు వెల్లడించింది.

Tags:    

Similar News