‘భారతీయ కాంగ్రెస్ పార్టీ’ ఫ్లెక్సీ వైరల్

దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏమిటో చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ.. గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ కట్ అవుట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఓ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ పోస్టర్‌లో బీజేపీ జెండా […]

Update: 2021-09-16 06:08 GMT

దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏమిటో చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ.. గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ కట్ అవుట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఓ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ పోస్టర్‌లో బీజేపీ జెండా ఉంచడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఆ పోస్టర్ చూసిన ప్రజలు ఖంగుతింటున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఎప్పుడు కలిసి పోయాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ‘‘భారతీయ కాంగ్రెస్ పార్టీ’’ అయ్యాయ అని ఛలోక్తులు విసురుతున్నారు. అయితే ఈ ఫ్లెక్సీ డిజైనర్ తప్పు చేశాడా.. లేక కావాలనే ఎవరైన క్రియోట్ చేశారా అన్నది తెలియాల్సి ఉన్నది.

Tags:    

Similar News