మీది ఆండ్రాయిడ్ ఫోనా? అయితే దీనితో జాగ్రత్త!
ఆకట్టుకునే సీనరీ లేదా ఏదైనా మంచి ఆహ్లాదాన్ని కలిగించే ఫొటో గానీ కనిపిస్తే.. దాన్ని వెంటనే వాల్‌పేపర్‌గా పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేయగానే ఈ వాల్‌పేపర్లు మనసుకు కొంత ప్రశాంతత కలిగించిన అనుభూతిని అందిస్తాయి. అలాంటి ఆహ్లాదాన్ని కలిగించే ఫొటో ఒకటి ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల తాటతీస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోతో ఆండ్రాయిడ్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందమైన సూర్యాస్తమయం, కొండలు, సరస్సు, పచ్చదనం ఉంది […]
ఆకట్టుకునే సీనరీ లేదా ఏదైనా మంచి ఆహ్లాదాన్ని కలిగించే ఫొటో గానీ కనిపిస్తే.. దాన్ని వెంటనే వాల్‌పేపర్‌గా పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేయగానే ఈ వాల్‌పేపర్లు మనసుకు కొంత ప్రశాంతత కలిగించిన అనుభూతిని అందిస్తాయి. అలాంటి ఆహ్లాదాన్ని కలిగించే ఫొటో ఒకటి ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల తాటతీస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోతో ఆండ్రాయిడ్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందమైన సూర్యాస్తమయం, కొండలు, సరస్సు, పచ్చదనం ఉంది కదా అని దాన్ని వాల్ పేపర్‌గా పెట్టుకోవద్దు. అలాచేస్తే ఇది మీ ఫోన్‌ని క్రాష్ చేస్తుంది. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా ప్రయోజనం ఉండదు. గ్యాలరీకి వెళ్లి ఆ ఫొటోను డిలీట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇక ఫోన్ మొత్తాన్ని రీస్టోర్ చేయక తప్పని పరిస్థితి. గూగుల్, శాంసంగ్, వన్‌ప్లస్, నోకియా, షివోమీ ఇలా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ వాల్‌పేపర్ వల్ల క్రాష్ అయ్యాయి. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్లు మరీ ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి.
అయితే ఆండ్రాయిడ్ పరికరాల్లో కలర్ ప్రొఫైల్ ఇష్యూ కారణంగానే ఇలా అవుతోందని ఒక నిపుణుడు చెబుతున్నాడు. ఆ ఫొటోలోని కలర్ స్కీములకు ఆండ్రాయిడ్ సపోర్ట్ చేయకపోవడమే అందుకు కారణమని ఓ రెడిట్ యూజర్ నిరూపించాడు. ఈ ఫొటోనే వాల్‌పేపర్ పెట్టుకోవడానికి స్క్రీన్ షాట్ తీసిగానీ లేదా కలర్ ప్రొపైల్ తగ్గించడం ద్వారా గానీ పెట్టుకోవచ్చని మరో యూజర్ సలహా ఇచ్చాడు. అందుకే ఈ ఇమేజ్ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి.