ప్రాణాలు తీసుకుంటాం కానీ.. ఇండ్లను వదలుకొం..
దిశ, అందోల్: పెదోడి సొంతింటి కలను నేరవేర్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బేడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదానికి దారి తీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చినట్లే ఇచ్చి.. 25 మందిని అనర్హులంటూ.. జాబితాను నుంచి తొలగించిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని డాకూర్ లో చోటుచేసుకుంది. మా ఇండ్లు మాక్కావాలంటూ సోమవారం లబ్దిదారులు అందోళన దిగారు. డాకూర్ లో 104 డబుల్ బెడ్ రూమ్ లకు 117 మందిని అధికారులు […]
దిశ, అందోల్: పెదోడి సొంతింటి కలను నేరవేర్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బేడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదానికి దారి తీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చినట్లే ఇచ్చి.. 25 మందిని అనర్హులంటూ.. జాబితాను నుంచి తొలగించిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని డాకూర్ లో చోటుచేసుకుంది. మా ఇండ్లు మాక్కావాలంటూ సోమవారం లబ్దిదారులు అందోళన దిగారు. డాకూర్ లో 104 డబుల్ బెడ్ రూమ్ లకు 117 మందిని అధికారులు గుర్తించి, లాటరీ పద్దతిలో నవంబర్ 6న ఆర్‌డీవో నేతృత్వంలో లబ్దిదారులను ఎంపిక చేసి, వారికి ఇండ్లను కేటాయించారు. లబ్దిదారులు వారికి కేటాయించిన ఇండ్లలోకి వేళ్లి శుభ్రం చేసుకుని, అనాధికారికంగా గృహప్రవేశాలను చేసి, రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు.
మంత్రి హరీష్ రావు చేత ప్రారంభోత్సవం తర్వాత ఇండ్లలోకి వేళ్లాలని, మీకు కేటాయించిన ఇండ్లు మీకే ఉంటాయని అధికారులు నచ్చజేప్పడంతో, వారంతా ఇండ్లకు తాళాలు వేసుకుని వేళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మంత్రి కార్యక్రమం వాయిదా పడింది. గత నాలుగు రోజుల క్రీతం అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వచ్చి కొత్తగా జాబితాను అతికించారు. ఈ జాబితాలో ఇండ్లు మంజూరైన వారిలో 25 మంది అనర్హులుగా పెర్కొంటూ..వారి స్థానంలో కొత్తగా 11 మందిని చేర్చారు. మిగతా 14 ఇండ్లను ఖాళీగానే చూపించారు. ఈ విషయం తెలుసుకున్న 25 మంది కుటుంబ సభ్యులు సోమవారం సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయానికి తరలివేళ్లి, తమకు కేటాయించిన ఇండ్లను తిరిగి ఏలా తీసుకుంటారని, తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
కాగా కలెక్టర్ న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం జోగిపేటలోని తహశీల్దార్ కార్యాలయం ముందు అందోళన చేపట్టారు. మా ఇండ్లు మాకే ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు కేటాయించిన ఇండ్లను అధికారులు ఖాళీ చేయమంటేనే తాము చేశామని, ఇప్పుడేలా ఇండ్లు ఇవ్వరంటూ నిలదీశారు. అధికారులు జాబితాను సిద్దం చేసేటప్పుడు నాలుగు పర్యాయలు విచారణ చేసిన తర్వాతనే ఎంపిక జరిగిందని, ఇప్పడు అనర్హులని చెప్పడం సమంజసం కాదన్నారు. లాటరీ పద్దతిలో ఎంపికైన తమకు అన్యాయం చేయవద్దని, మాకు కేటాయించిన ఇండ్లను మాకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చావనైనా చస్తాం..కానీ ఇండ్లను వదులుకోమని వారు తెల్చిచేప్పారు.