సర్జరీ అయిన వేలుతో ఇబ్బంది లేదు : బెన్ స్టోక్స్

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలుకి ఇటీవల సర్జరీ అయిన విషయం తెలిసిందే. ఈ వేలి కారణంగా ఇండియాతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో ఇబ్బందులు ఏర్పడవని బెన్‌స్టోక్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్.. వేలు తీవ్రంగా బాధించడంతో పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్ఇంజెక్షన్ తీసుకొని ఆడాడు. దీంతో అతడు టెస్టు సిరీస్ ఆడగలడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. […]

Update: 2021-07-18 09:13 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలుకి ఇటీవల సర్జరీ అయిన విషయం తెలిసిందే. ఈ వేలి కారణంగా ఇండియాతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో ఇబ్బందులు ఏర్పడవని బెన్‌స్టోక్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్.. వేలు తీవ్రంగా బాధించడంతో పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్ఇంజెక్షన్ తీసుకొని ఆడాడు. దీంతో అతడు టెస్టు సిరీస్ ఆడగలడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.

అంతే కాకుండా టెస్టు సిరీస్‌కు ముందు ది హండ్రెడ్ లీగ్‌లో నార్తరన్ సూపర్ చార్జెస్ తరపున కూడా ఆడాల్సి ఉన్నది. ‘ప్రస్తుతానికి తాను బ్రేక్ తీసుకున్నాను. స్టెరాయిడ్స్ నా శరీరంపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని ది హండ్రెడ్, ఇండియా టెస్టు సిరీస్ ఆడాలని అనుకుంటున్నాను. ఈ వేలు కారణంగా టెస్టు సిరీస్‌కు వచ్చే ఇబ్బందేమీ లేదు. అది ఎంత ముఖ్యమైన టెస్ట్ సిరీసో మాకు తెలుసు. దాంట్లో చక్కని ప్రదర్శన చేయాలని అందరం భావిస్తున్నాము’ అని బెన్ స్టోక్స్ డైలీ మిర్రర్ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.

Tags:    

Similar News