'ప్రభుత్వమే భయపడి ఆమెను కిరాతకంగా చంపించింది'

దిశ, సికింద్రాబాద్: గానకోకిల బెల్లి లలితపై తీసిన సినిమాను వెంటనే నిషేధించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓయూలో వారు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, తన పాటల ద్వారా తెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కామ్రేడ్ బెల్లి లలితక్క ఉద్యమానికి తోడుగా నిలిచిందన్నారు. ఆనాటి ప్రభుత్వం భయపడి ఆమెను కిరాతకంగా చంపించిందన్నారు. ఆమె వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కనీసం ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం […]

Update: 2021-12-28 08:12 GMT

దిశ, సికింద్రాబాద్: గానకోకిల బెల్లి లలితపై తీసిన సినిమాను వెంటనే నిషేధించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓయూలో వారు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, తన పాటల ద్వారా తెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కామ్రేడ్ బెల్లి లలితక్క ఉద్యమానికి తోడుగా నిలిచిందన్నారు. ఆనాటి ప్రభుత్వం భయపడి ఆమెను కిరాతకంగా చంపించిందన్నారు. ఆమె వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కనీసం ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను అవమానించేలా రూపొందిస్తున్న సినిమాపై వెంటనే నిషేధం విధించాలని, సినిమా తీసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ కుమార్, నవీన్, సందీప్, మౌనిక, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News