బిర్యానీలో బీర్ సీసా ముక్కలు.. షాకైన కస్టమర్

దిశ, వెబ్‌డెస్క్ : బిర్యానీ అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. వీకెండ్స్‌లో బిర్యానీని రుచిచూసేందుకు ఎంతో మంది రెస్టారెంట్లకు, హోటల్స్‌కు క్యూ కడతారు. ఈ క్రమంలో బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తింటుండగా.. నోట్లో గాజు సీసా ముక్కు గుచ్చుకుంది. దీంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కస్టమర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతడికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హోటల్ యాజమాన్యం […]

Update: 2021-08-04 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బిర్యానీ అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. వీకెండ్స్‌లో బిర్యానీని రుచిచూసేందుకు ఎంతో మంది రెస్టారెంట్లకు, హోటల్స్‌కు క్యూ కడతారు. ఈ క్రమంలో బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తింటుండగా.. నోట్లో గాజు సీసా ముక్కు గుచ్చుకుంది. దీంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కస్టమర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతడికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హోటల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో తిరువళ్లకు చెందిన శైలేష్ ఊమెన్.. 2017లో తన కుటుంబంతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. అనంతరం బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో బిర్యానీ తింటుండగా.. శైలేష్​నోటికి ఏదో గుచ్చినట్లు అనిపించింది. చూస్తే బీరు సీసా ముక్క కనిపించింది. వెంటనే హోటల్ యజమానికి సమాచారం అందించి.. ఆస్పత్రికి వెళ్లాడు.

అప్పట్లో దీనిపై స్పందించిన హోటల్ యజమాని.. ఇలాంటివి జరగడం సాధారణమని వ్యాఖ్యానించాడు. దీంతో హోటల్ యాజమాన్యంపై వినియోగదారుల కోర్టులో శైలేష్​ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. రూ.10,000 పరిహారంతో పాటు రూ.2,000 కోర్టు ఖర్చులకు కస్టమర్‌కు చెల్లించాలని హోటల్ యజమాన్యాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News