జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకంటే? గుట్టువిప్పిన యనమల
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ రెండురోజులపాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు వంటి ఇతర అంశాలపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే జగన్ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని సొంత ప్రయోజనాల కోసమేనని ఆరోపణలు చేశారు. బెయిల్ రద్దు చేసి జైలుకు పంపుతారేమోనన్న భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లి […]
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ రెండురోజులపాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు వంటి ఇతర అంశాలపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే జగన్ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని సొంత ప్రయోజనాల కోసమేనని ఆరోపణలు చేశారు. బెయిల్ రద్దు చేసి జైలుకు పంపుతారేమోనన్న భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలిశారని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీలో పర్యటించినట్టయితే.. పర్యటనకు సంబంధించిన వివరాలను ఎందుకు ప్రజలకు వెల్లడించడంలేదని యనమల నిలదీశారు. జగన్ పర్యటన కేసుల మాఫీ కోసం తప్ప మరోదాని కోసం కాదన్నారు. ప్రత్యేక విమానాల్లో తరచుగా ఢిల్లీ వెళుతున్న సీఎం జగన్ తన పర్యటన వివరాలను, తాను కేంద్రం పెద్దలకు అందించే విజ్ఞాపన పత్రాలను ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారీ మీడియా ముందుకు రాకపోవడం చూస్తుంటే, లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్న విషయం తెలుస్తోందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.