బ్యూటీకి కేరాఫ్ ముల్తానీ మట్టి..
దిశ, వెబ్‌డెస్క్: మగువల అందానికి ముల్తానీ మట్టి చాలా దోహదపడుతుంది. అందుకే బ్యూటీ చికిత్సల్లో ముల్తానీ మట్టిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మంలోని మలినాలను తొలగించడంలో ఇది ఎంతగానో సహయపడుతోంది. ఇది కొత్తగా ఇప్పుడు ఉపయోగిస్తున్న సౌందర్య సాధనమేమీ కాదు.. రోమన్ కాలం నుంచి ముల్తానీ మట్టిని బ్యూటీ వస్తువుగా వాడుతున్నారు. ముల్తానీ మట్టి వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో ముల్తానీ మట్టి బ్యూటీపార్లర్ […]
దిశ, వెబ్‌డెస్క్: మగువల అందానికి ముల్తానీ మట్టి చాలా దోహదపడుతుంది. అందుకే బ్యూటీ చికిత్సల్లో ముల్తానీ మట్టిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మంలోని మలినాలను తొలగించడంలో ఇది ఎంతగానో సహయపడుతోంది. ఇది కొత్తగా ఇప్పుడు ఉపయోగిస్తున్న సౌందర్య సాధనమేమీ కాదు.. రోమన్ కాలం నుంచి ముల్తానీ మట్టిని బ్యూటీ వస్తువుగా వాడుతున్నారు. ముల్తానీ మట్టి వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో ముల్తానీ మట్టి బ్యూటీపార్లర్ లోనే కాదు, ఇంట్లో కూడా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్. ముఖం మీద జిడ్డు, మలినాలు తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. చర్మం నునుపు తేలి మృదువుగా మారుతోంది. ఇది బ్లడ్ సర్కూలేషన్ను ఇంప్రూవ్ చేస్తోంది. స్కిన్ టోన్ మరియు టెక్చర్ కోసం దీనిని రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. ఈ మట్టిలో అనేక యాంటీ టాన్సోప్స్, ఫేస్‌వాష్‌లు, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఆయిల్ స్కిన్ లేదా జిడ్డు చర్మం ఉన్నవారు 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, పావు టీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ తేనె, పావు టీస్పూన్ పుదీనా పొడి వేసి కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. దీంతో చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది. ఇలా నెలకు మూడుసార్లు రాసుకుంటే మొటిమలు, జిడ్డు తగ్గడమే కాకుండా ముఖం అందంగానూ కనిపిస్తోంది.
ముల్తానీ మట్టి ఎక్స్ ఫ్లోయేట్ లేదా స్ర్కబ్బర్గా ఉపయోగించవచ్చు. దీంతో ముఖం మీద ఉన్న బ్లాక్, వైట్ హెడ్స్‌ను నివారిస్తోంది. ముల్తానీ మట్టిని ఫేస్‌ప్యాక్‌లలో విరివిగా ఉపయోగించవచ్చు. 2 టీ స్పూన్స్ ముల్తానీ మట్టిలో అంతే పన్నీరు, 1/4 టీస్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10 నిముషాలు వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఈ ప్యాక్‌ను వాడుకుంటే, నల్లని చర్మంలో చాలా వరకూ మార్పు వస్తుంది.
ముల్తానీ మట్టిని ముఖానికి ప్రతిరోజూ వాడకూడదు. అతిగా వాడటం వల్ల చర్మంలోని నేచురల్ మాయిశ్చరైజర్‌ను కోల్పోయేలా చేస్తుంది. దీంతో స్కిన్ పొడి బారుతోంది. వారానికి రెండుసార్లు కన్నా ఎక్కువగా వాడకూడదు. ముల్తానీ మట్టిని డైరెక్ట్‌గా కాకుండా శాండల్‌వుడ్ పౌడర్‌లో కలిపి వాడితే ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య తగ్గుతోంది. ఇందులో కొంచెం రోజ్ వాటర్‌ను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకొని ముఖానికి రాసుకోవాలి. దీంతో చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.