లైంగిక వేధింపుల నివారణకు BCCI నూతన విధానం
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ మరో నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. క్రికెటర్లపై లైంగిక వేధింపుల నివారణ కోసం బీసీసీఐ ఆమోదించిన ఆ విధానం పరిధిలోకి భారత క్రికెటర్లు వస్తారని స్పష్టం చేసింది. కాగా, లైంగిక వేధింపుల విషయంలో బీసీసీఐకి ఇప్పటిదాకా ఓ విధానమంటూ ఏదీ లేదు. భారత క్రికెటర్లు, బీసీసీఐ అధికార ప్రతినిధులు, అపెక్స్ కౌన్సిల్, ఐపీఎల్ పాలక వర్గ సభ్యులు, సీనియర్ స్థాయి నుంచి అండర్-16 క్రికెటర్లు ఇలా దాదాపు అందరికీ వర్తించేలా కొత్త నూతన […]
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ మరో నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. క్రికెటర్లపై లైంగిక వేధింపుల నివారణ కోసం బీసీసీఐ ఆమోదించిన ఆ విధానం పరిధిలోకి భారత క్రికెటర్లు వస్తారని స్పష్టం చేసింది. కాగా, లైంగిక వేధింపుల విషయంలో బీసీసీఐకి ఇప్పటిదాకా ఓ విధానమంటూ ఏదీ లేదు. భారత క్రికెటర్లు, బీసీసీఐ అధికార ప్రతినిధులు, అపెక్స్ కౌన్సిల్, ఐపీఎల్ పాలక వర్గ సభ్యులు, సీనియర్ స్థాయి నుంచి అండర్-16 క్రికెటర్లు ఇలా దాదాపు అందరికీ వర్తించేలా కొత్త నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ (ఐసీ) ని ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి విచారణ జరిపి ఈ కమిటీ 90 రోజుల్లో తమ నివేదికను బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. విచారణ 60 రోజుల్లోపు జరిపి ఆ నివేదికను బీసీసీఐ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఫిర్యాదుదారుడు లేదా ప్రతివాది ఒకవేళ తీర్పు నచ్చకపోతే బయటి కోర్టులను ఆశ్రయించవచ్చని బీసీసీఐ తెలిపింది.