టీమ్ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనకు వీరితో పాటు సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు కూడా వెంట వెళ్లనున్నాయి. అయితే ఈ నెలాఖరులో ముంబైలో బయోబబుల్‌లోకి వీరందరినీ బీసీసీఐ పంపనున్నది. అంతకు […]

Update: 2021-05-11 09:37 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనకు వీరితో పాటు సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు కూడా వెంట వెళ్లనున్నాయి. అయితే ఈ నెలాఖరులో ముంబైలో బయోబబుల్‌లోకి వీరందరినీ బీసీసీఐ పంపనున్నది.

అంతకు ముందు ప్రతీ ఒక్కిరికి కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఆ టెస్టులో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వారిని ఇంగ్లాండ్ పంపబోమని హెచ్చరించింది. కాబట్టి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది ముంబై చేరుకునే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. సాధ్యమైనంత వరకు ఐసోలేషన్‌లో ఉండి కరోనా వైరస్ బారిన పడకూడదని టీమ్ ఇండియా ఫిజియో యోగాశ్ పర్మార్ ఆటగాళ్లకు సూచించారు. ఇది జట్టులోని ప్రతీ ఒక్కరికి వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News