ఐపీఎల్, స్టార్ డీల్ అతడిని రక్షించింది!

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తొలి సీఈవోగా పని చేసిన రాహుల్ జోహ్రీ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పెంచారు. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఈ పొడిగింపు చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐకి పూర్తి స్థాయి పాలకవర్గమే లేని సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి చైర్మన్ శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌లు కలసి రాహుల్‌ను సీఈవోగా నియమించారు. బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఆర్ఎం లోధా కమిటీ చేసిన తొలి సూచన సీఈవోను నియమించడమే. […]

Update: 2020-05-16 05:51 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తొలి సీఈవోగా పని చేసిన రాహుల్ జోహ్రీ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పెంచారు. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఈ పొడిగింపు చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐకి పూర్తి స్థాయి పాలకవర్గమే లేని సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి చైర్మన్ శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌లు కలసి రాహుల్‌ను సీఈవోగా నియమించారు. బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఆర్ఎం లోధా కమిటీ చేసిన తొలి సూచన సీఈవోను నియమించడమే. కాగా, ఆడవాళ్లపై లైంగిక వేధింపుల నిరసనల్లో బాగంగా తెరపైకి వచ్చిన #MeToo ఉద్యమ సమయంలో రాహుల్ జొహ్రీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. డిస్కవరీ ఛానల్‌లో పని చేసే సమయంలో జోహ్రీ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించింది. ఆ సమయంలో పాలక కమిటీకి చైర్మన్‌గా ఉన్న వినోద్ బారు విచారణ జరిపించి.. జోహ్రీకి క్లీన్ చిట్ ఇచ్చారు.

సుప్రీంకోర్టు కనుసన్నల్లో బీసీసీఐ నడిచే కాలంలోనే ఐపీఎల్‌తో సోనీకి ఉన్న ఒప్పందం ముగిసిపోయింది. గతంలో మీడియాలో పని చేసిన అనుభవం ఉన్న జోహ్రీ ఆన్నీ తానై వ్యవహరించి ఐపీఎల్, స్టార్ టీవీ డీల్ కుదిర్చారు. అసలు ఎవరూ ఊహించనంతగా రూ. 16,347 కోట్లకు ప్రసారహక్కులు అమ్మారు. దీంతో రాహుల్ పేరు మార్మోగిపోయింది. బీసీసీఐ పెద్దలు కూడా ఆ తర్వాత రాహుల్‌పై నమ్మకముంచారు. బీసీసీఐకి పూర్తి స్థాయి పాలకమండలి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరిలో రాహుల్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాజాగా ఆ రాజీనామా తిరస్కరించడమే కాకుండా, కరోనా కష్టసమయంలో సంస్థను విడిచి వెళ్లడం భావ్యం కాదని వారించారు. మరో ఏడాది పాటు బీసీసీఐకి సీఈవో బాధ్యతలు రాహుల్‌కు అప్పగించారు.

Tags:    

Similar News