విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ భరోసా
దిశ, స్పోర్ట్స్: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన చెందిన పలువురు విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి నిష్క్రమించి స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, అడమ్ జంపా తమ ఫ్రాంచైజీలను వీడి వెళ్లిపోయారు. మరి కొంత మంది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా వారి బాటలోనే ఐపీఎల్‌ను వీడనున్నారనే వార్తల నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. ఐపీఎల్ పూర్తయిన వెంటనే విదేశీ ఆటగాళ్లను తమ తమ దేశాలకు సురక్షితంగా […]
దిశ, స్పోర్ట్స్: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన చెందిన పలువురు విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి నిష్క్రమించి స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, అడమ్ జంపా తమ ఫ్రాంచైజీలను వీడి వెళ్లిపోయారు. మరి కొంత మంది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా వారి బాటలోనే ఐపీఎల్‌ను వీడనున్నారనే వార్తల నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. ఐపీఎల్ పూర్తయిన వెంటనే విదేశీ ఆటగాళ్లను తమ తమ దేశాలకు సురక్షితంగా చేరవేసే పూర్తి బాధ్యత బీసీసీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చింది.
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే కారణంతో పలువురు ప్లేయర్లు లీగ్‌ను వీడటంతో బీసీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంగ్ అమిన్ గురువారం ఒక లేఖ రాశారు. ‘మీలో చాలా మంది ఇంటికి తిరిగి చేరుకుంటామా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక సారి ఈ లీగ్ ముగిసిన వెంటనే మీ గమ్యస్థానాలకు సురక్షితంగా బీసీసీఐ చేరవేస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బోర్డు నిశితంగా గమనిస్తున్నది. ప్రభుత్వం అధికారులతో మేం ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాము. మీ ప్రయాణాలపై మీరు చింతించవద్దు. మే 30 ఐపీఎల్ ముగిసినా.. మీరు మీ ఇళ్లకు క్షేమంగా చేరే వరకు బీసీసీఐకి టోర్నీ ముగిసినట్లు కాదు’ అని ఆ లేఖలో హేమంగ్ అమిన్ పేర్కొన్నారు.