సాహ రాకతో పంత్‌ను పక్కన పెట్టారు

ఆడిలైడ్: ఆడిలైడ్ వేదికగా గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడంతో ఓపెనింగ్ జోడీ ఖరారైనట్లే. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఆశ్విన్‌కు అవకాశం కల్పించారు. ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా స్పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వృద్ధిమాన్ సాహ వచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఛతేశ్వర్ […]

Update: 2020-12-16 04:51 GMT

ఆడిలైడ్: ఆడిలైడ్ వేదికగా గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడంతో ఓపెనింగ్ జోడీ ఖరారైనట్లే. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఆశ్విన్‌కు అవకాశం కల్పించారు. ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా స్పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వృద్ధిమాన్ సాహ వచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాతోపాటు ఆరో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారికి అవకాశం దక్కింది. వార్మప్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ నమోదు చేసిన శుభమన్‌గిల్, సెంచరీ బాదిన రిషబ్ పంత్‌కు మొండి చేయి చూపారు.

తొలి టెస్టుకు తుది జట్టు
పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (సి), అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహ (కీపర్), రవింద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా

Tags:    

Similar News