ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలి -TRS MLC Kalvakuntla Kavitha

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని అర్హులైన బీసీలకు అందేలా చూడాలని, ఆ బాధ్యత బీసీ కమిషన్ సభ్యులదేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ కమిషన్ సభ్యునిగా నియామకమైన సందర్భంగా కె. కిషోర్ గౌడ్, ఎమ్మెల్సీని సోమవారం హైదరాబాదులోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత ఆయనను అభినందించారు. వెనుకబడిన బీసీల అందరిని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత బీసీ కమిషన్ సభ్యులపై ఉందని సూచించారు. […]

Update: 2021-09-13 01:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని అర్హులైన బీసీలకు అందేలా చూడాలని, ఆ బాధ్యత బీసీ కమిషన్ సభ్యులదేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ కమిషన్ సభ్యునిగా నియామకమైన సందర్భంగా కె. కిషోర్ గౌడ్, ఎమ్మెల్సీని సోమవారం హైదరాబాదులోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత ఆయనను అభినందించారు. వెనుకబడిన బీసీల అందరిని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత బీసీ కమిషన్ సభ్యులపై ఉందని సూచించారు. పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ఆ లక్ష్య సాధన కోసం పని చేయాలని కోరారు. ఆయన వెంట తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News