బతుకమ్మ పాటతో కేసీఆర్ ను కడిగేసిన మహిళలు.. వీడియో వైరల్

దిశ‌ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : నోటిఫికేష‌న్లు ఉయ్యాలో.. నోటిమాట‌లాయే ఉయ్యాలో.. నిరుద్యోగి భృతి ఉయ్యాలో.. నోటిమూట‌లాయే ఉయ్యాలో.. రైతుల రుణామాఫీ ఉయ్యాలో.. ఖాతాలేని కూత‌లో ఉయ్యాలో.. కేజీ టు పీజీ అనే ఉయ్యాలో.. ఉచిత విద్య లేక‌పాయో ఉయ్యాలో.. మూడెక‌రాల ముచ్చ‌ట ఉయ్యాలో.. మూల‌కే ప‌డే ఉయ్యాలో.. ద‌ళిత‌బంధు అనే ఉయ్యాలో.. ద‌గా చేయ‌బ‌ట్టే ఉయ్యాలో.. బంగారు తెలంగాణ ఉయ్యాలో.. బ‌ట్టేబాజ్ మాట‌లాయే ఉయ్యాలో.. అంటూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్న బ‌తుక‌మ్మ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. […]

Update: 2021-10-05 22:27 GMT

దిశ‌ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : నోటిఫికేష‌న్లు ఉయ్యాలో.. నోటిమాట‌లాయే ఉయ్యాలో.. నిరుద్యోగి భృతి ఉయ్యాలో.. నోటిమూట‌లాయే ఉయ్యాలో.. రైతుల రుణామాఫీ ఉయ్యాలో.. ఖాతాలేని కూత‌లో ఉయ్యాలో.. కేజీ టు పీజీ అనే ఉయ్యాలో.. ఉచిత విద్య లేక‌పాయో ఉయ్యాలో.. మూడెక‌రాల ముచ్చ‌ట ఉయ్యాలో.. మూల‌కే ప‌డే ఉయ్యాలో.. ద‌ళిత‌బంధు అనే ఉయ్యాలో.. ద‌గా చేయ‌బ‌ట్టే ఉయ్యాలో.. బంగారు తెలంగాణ ఉయ్యాలో.. బ‌ట్టేబాజ్ మాట‌లాయే ఉయ్యాలో.. అంటూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్న బ‌తుక‌మ్మ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. హామీలిచ్చి విస్మ‌రించిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరును బ‌తుక‌మ్మ పాటగా రూప‌క‌ల్ప‌న చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ మారింది. పెత్ర‌మావాస్య‌ను పుర‌స్క‌రించుకుని బుధ‌వారం నుంచి బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభ‌కానున్న విష‌యం తెలిసిందే. బ‌తుక‌మ్మ పాట రూపంలో విమ‌ర్శ‌కులు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News