కమాండోల అప్రమత్తత.. నిలిచిన ప్రాణాలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల క్యాంపును విచ్ఛిన్నం చేశారు సీ60 బెటాలియన్ కమాండోలు. రెండు మందు పాతరను కూడా గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఏటపల్లి తాలుక కోకోటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో సీ60 కమాండోలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కమాండోలను గమనించిన మావోయిస్టులు ఆ స్థావరాన్ని వదిలి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న కమాండోలు.. వంట పాత్రలు, బట్టలు, సాహిత్యం పుస్తకాలు, […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల క్యాంపును విచ్ఛిన్నం చేశారు సీ60 బెటాలియన్ కమాండోలు. రెండు మందు పాతరను కూడా గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏటపల్లి తాలుక కోకోటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో సీ60 కమాండోలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కమాండోలను గమనించిన మావోయిస్టులు ఆ స్థావరాన్ని వదిలి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న కమాండోలు.. వంట పాత్రలు, బట్టలు, సాహిత్యం పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మందు పాతరలను కమాండోలు గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కమాండోలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మావోయిస్టుల ఏరివేత కోసం కమాండోలు, స్థానిక పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.