ఆఖరి ఓవర్లో ఆరు సిక్సులు
దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించబడింది. ఐర్లాండ్‌లో జరిగిన ఒక టీ20లో ఆఖరి ఓవర్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే ఇది అసాధ్యమైన స్కోరు. వరుసగా ఆరు సిక్సులు కొడితే కాని గెలవలేని పరిస్థితి. కానీ, క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆరు సిక్సులు బాదేశాడు. అతడే బాలీమెనా బ్యాట్స్‌మాన్ జాన్ గ్లాస్. ఐర్లాండ్‌లో జరుగుతున్న ఎల్‌వీఎస్ టీ20 ఫైనల్‌లో క్రెగాగ్-బాలీమెనా జట్లు తలపడ్డాయి. తొలుత […]
దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించబడింది. ఐర్లాండ్‌లో జరిగిన ఒక టీ20లో ఆఖరి ఓవర్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే ఇది అసాధ్యమైన స్కోరు. వరుసగా ఆరు సిక్సులు కొడితే కాని గెలవలేని పరిస్థితి. కానీ, క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆరు సిక్సులు బాదేశాడు. అతడే బాలీమెనా బ్యాట్స్‌మాన్ జాన్ గ్లాస్. ఐర్లాండ్‌లో జరుగుతున్న ఎల్‌వీఎస్ టీ20 ఫైనల్‌లో క్రెగాగ్-బాలీమెనా జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ 147 పరుగులు చేసింది.
టీ20 క్రికెట్‌లో ఇది సాధ్యమయ్యే స్కోరే. కానీ బాలిమెనా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో 19 ఓవర్లలో 113/7 స్కోర్ చేసింది. చివరి ఓవర్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌పై అందరూ ఆశలు వదిలేసుకున్న దశలో జాన్ గ్లాస్ చెలరేగిపోయాడు. చివరి ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి జట్టును గెలిపించాడు. చివరి వరకు ఉండి 87 పరుగులతో అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన సామ్ స్వయంగా గ్లాస్‌కు సోదరుడు కావడం మరో విశేషం.