నిండుకుండలా బాసర గోదావరి..!
దిశ, బాసర: నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర గోదావరి నది నిండుకుండలా మారింది. గతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి నీరు వస్తుండడంతో బాసర గోదావరి జలకళ సంతరించుకుంది. బాసర వద్ద ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటిమట్టం నిండడంతో సరస్వతి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులను కనువిందు చేస్తోంది. సకాలంలో వర్షాలు కురవడంతో పంటలకు సమృద్ధిగా నీరు చేరుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.