భారత వృద్ధిరేటు అంచనా..ఇదే అత్యల్పం!

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే అనేక రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధిరేటుని తగ్గించిన విషయం తెలిసిందే..వాటిలో అత్యల్పంగా ప్రపంచబ్యాంకు 1.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే, బొత్తిగా 1.5 శాతం అనకపోయినప్పటికీ 1.5 శాతం నుంచి 2.8 శాతం అని వెల్లడించింది. తర్వాత అత్యల్పంగా ఫిచ్ రేటింగ్ సంస్థ 2 శాతం వృద్ధి అంచనాను ప్రకటించింది. అలాగే, అక్యూట్ రేటింగ్స్ 2 శాతం నుంచి 3 శాతమని, సెంట్రమ్ రీసెర్చ్ సంస్థ 3.1 శాతంగా భారత వృద్ధిరేటు […]

Update: 2020-04-14 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే అనేక రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధిరేటుని తగ్గించిన విషయం తెలిసిందే..వాటిలో అత్యల్పంగా ప్రపంచబ్యాంకు 1.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే, బొత్తిగా 1.5 శాతం అనకపోయినప్పటికీ 1.5 శాతం నుంచి 2.8 శాతం అని వెల్లడించింది. తర్వాత అత్యల్పంగా ఫిచ్ రేటింగ్ సంస్థ 2 శాతం వృద్ధి అంచనాను ప్రకటించింది. అలాగే, అక్యూట్ రేటింగ్స్ 2 శాతం నుంచి 3 శాతమని, సెంట్రమ్ రీసెర్చ్ సంస్థ 3.1 శాతంగా భారత వృద్ధిరేటు అంచనాను ప్రకటించాయి. అయితే, మంగళవారం బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంకు, ఫైనాన్సియల్ సంస్థ బార్‌క్లేస్ భారత వృద్ధిరేటును ఏకంగా సున్నాగా అంచనాలను ప్రకటించింది. ఇప్పటివరకూ వెలువడిన పలు రేటింగ్ సంస్థల అంచనాలన్నిటిలో ఇదే అత్యల్పం.

కొవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి ఇండియాలో మే 2 వరకూ లాక్‌డౌన్ పొడిగించనున్న నేపథ్యంలో బార్‌క్లేస్ ఇండియా వృద్ధి రేటు అంచనాను సున్నాకు తగ్గించింది. ఇంతకుముందు 2.5 శాతంగా ప్రకటించిన ఈ సంస్థ ఆర్థిక పతనం మరింత దారుణంగా ఉండనుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఇండియాలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరుకోకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆంక్షల కారణంగా ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని నమ్ముతున్నామని సంస్థ నివేదికలో పేర్కొంది. మైనింగ్, వ్యవసాయం, తయారీ, అవసరమైన రంగాలు లాక్‌డౌన్ వల్ల ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని నివేదిక తెలిపింది.

సేవా రంగం కలిపి అనేక రంగాలకు అంతరాయం ఏర్పడటం వల్ల సుమారు రూ. 17 లక్షల కోట్లు నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు ఇదే సంస్థ రూ. 9 లక్షల కోట్ల ఆర్థిక నష్టం ఉండోచ్చని అంచనా వేసింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 8.1 శాతానికి సమానం. అంతేకాకుండా దేశంలో మే నెల చివరి వరకూ పాక్షిక లాక్‌డౌన్ ఉంటుందని భావిస్తున్నట్టు బార్‌క్లేస్ పేర్కొంది. పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలకు అధికంగా ఆర్థిక నష్టాలు తప్పవని బార్‌క్లేజ్ తెలిపింది. పైగా, ఈ రాష్ట్రాల్లోనే అధిక కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలకంటే ఎక్కువ కాలం లాక్‌డౌన్ ప్రభావాం ఇక్కడ ఉంటుందని సంస్థ నివేదిక పేర్కొంది. రికవరీ బాగా ఉన్న కేరళ, కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాలకు కూడా నష్టాలు తప్పవని నివేదిక చెబుతోంది.

Tags: Barclays, Coronavirus, Covid-19,Economy, GDP, India

Tags:    

Similar News