అంతటికీ ఒబామానే కారణం.. ట్రంప్ ఆరోపణలు

వాషింగ్టన్: కరోనా కట్టడిలో నిర్లక్ష్యం వహించి సమస్యను నెత్తిమీదకు తెచ్చుకున్నాక ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడిపై నిందలు వేస్తున్నారు. ఇప్పుడున్న దుస్థితికి మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామానే కారణమనే అనవసర అభాండాలు మోపుతున్నారు. కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేటుగా ఆరు వారాల తర్వాత స్పందించినా అమెరికాలో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు తీరా ఈ నష్టానికి గత అధ్యక్షుడు బరాక్ […]

Update: 2020-04-13 10:02 GMT

వాషింగ్టన్: కరోనా కట్టడిలో నిర్లక్ష్యం వహించి సమస్యను నెత్తిమీదకు తెచ్చుకున్నాక ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడిపై నిందలు వేస్తున్నారు. ఇప్పుడున్న దుస్థితికి మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామానే కారణమనే అనవసర అభాండాలు మోపుతున్నారు.

కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేటుగా ఆరు వారాల తర్వాత స్పందించినా అమెరికాలో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు తీరా ఈ నష్టానికి గత అధ్యక్షుడు బరాక్ ఒబానే కారణమంటూ అనవరమైన అభాండాలు వేస్తున్నారు. ఒబామా కాలంలో కరోనా వైరస్‌కు సంబంధించిన టెస్టులు సరిగా చేయలేదని.. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి తన బాధ్యత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా టెస్టులు ఎందుకు చాలా నెమ్మదిగా చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఒబామానే దీనికి కారణమంటూ సమాధానమిచ్చారు. ట్రంప్ ఇచ్చిన సమాధానానికి మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒబామా కాలంలో అసలు నావెల్ కరోనా వైరస్ లేనేలేదు. 2019 డిసెంబర్‌లో చైనాలో తొలి సారి ఈ వైరస్‌ను కనుగొన్నారు. అలాంటప్పుడు కరోనా టెస్టులకు, ఒబామాకు ఏం సంబంధమని బుర్రలు గోక్కుంటున్నారు.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో హెచ్1ఎన్1 మహమ్మారి వచ్చింది. దీనినే సాధారణ భాషలో స్వైన్ ఫ్లూ అంటారు. అప్పుడు ఒబామా అమెరికా దేశాధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు కూడా స్వైన్ ఫ్లూ టెస్టులు సరిగా జరపలేదు.. దీంతో 14 వేల మంది మరణించారు. అదే సమయంలో కరోనా టెస్టులు కూడా జరిపి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు. కాని, అప్పట్లో ఒబామా ప్రభుత్వం స్వైన్ ఫ్లూను గుర్తించిన ఒక నెలలోపే 10లక్షల టెస్టులు చేసింది. కాని కరోనా వైరస్ తొలి సారిగా గుర్తించిన 50 రోజుల తర్వాత కూడా ట్రంప్ ప్రభుత్వం 10 వేల టెస్టులు కూడా చేయలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా సరే తప్పంతా ఒబామాదే అని ట్రంప్ వ్యాఖ్యానించడం అతడి అనుభవ లేమికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.

TAGS: america president, donald trump, barack obama, mistakes, coronavirus

Tags:    

Similar News