డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు పెరగనున్నాయి
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలు(డోర్‌స్టెప్ బ్యాంకింగ్) రానున్న కొద్ది నెలల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు. ఇటీవలే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కు కొత్త ఛైర్మన్‌గా ఆయన నియమించబడ్డారు. ఛార్జబుల్, ఔట్‌సోర్సింగ్ సేవలుగా పరిగణిస్తూ ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఈ రకమైన సేవలు సీనియర్ సిటిజిన్‌లకు ఎంతో ఉపయోగపడుతుంది. కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే కస్టమర్లకు […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలు(డోర్‌స్టెప్ బ్యాంకింగ్) రానున్న కొద్ది నెలల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు. ఇటీవలే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కు కొత్త ఛైర్మన్‌గా ఆయన నియమించబడ్డారు.
ఛార్జబుల్, ఔట్‌సోర్సింగ్ సేవలుగా పరిగణిస్తూ ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఈ రకమైన సేవలు సీనియర్ సిటిజిన్‌లకు ఎంతో ఉపయోగపడుతుంది. కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే కస్టమర్లకు ఇంటి వద్దే ఆర్థికేతర సేవలను ప్రారంభించాము. పెన్షనర్ల ధృవీకరణ పత్రాలను సేకరిస్తున్నాం. త్వరలో క్యాష్-డెలివరీ, కలెక్షన్ సేవలను అందించాలని భావిస్తున్నామని రాజ్‌కిరణ్ వివరించారు.