డ్యామిట్..క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గిపోయింది!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో కార్డుల్లో డబ్బులు తరిగిపోతున్నాయి. కరోనా దెబ్బకు బ్యాంకులన్నీ వినియోగదారుల క్రెడిట్ కార్డుల లిమిట్‌ను భారీగా తగ్గించాయి. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకులు కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులు తమ కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఏకంగా 30 శాతం నుంచి 90 శాతం తగ్గించాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రీపేమెంట్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కొవిడ్-19 వల్ల దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉద్యోగులకు […]

Update: 2020-04-21 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో కార్డుల్లో డబ్బులు తరిగిపోతున్నాయి. కరోనా దెబ్బకు బ్యాంకులన్నీ వినియోగదారుల క్రెడిట్ కార్డుల లిమిట్‌ను భారీగా తగ్గించాయి. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకులు కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులు తమ కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఏకంగా 30 శాతం నుంచి 90 శాతం తగ్గించాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రీపేమెంట్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

కొవిడ్-19 వల్ల దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉద్యోగులకు జీతాల్లో కోతతో పాటు కొందరికి ఉద్యోగాలే గల్లంతయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చాలామంది ఉద్యోగులు క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు. లాక్‌డోఉన్‌తో పాటు తర్వాత పరిస్థితుల్లోను క్రెడిట్ కార్డుని నమ్ముకునే సమస్యలను గట్టెక్కాలని భావిస్తున్నారు. అయితే, క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో బ్యాంకులకు భారం తప్పట్లేదు. దీంతో కార్డుల లిమిట్‌ను కస్టమర్లకు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. సగానికిపైగా లిమిట్‌ను తగ్గించేశాయి.

జాతీయ పత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం…దేశీయ దిగ్గజ బ్యాంకు యాక్సిస్ బ్యాంకులో సుమారు 2 లక్షల మంది వినియోగదారుల క్రెడిట్ కార్డుల లిమిట్‌లో కోత విధించినట్టు తెలుస్తోంది. ఇది ఏప్రిల్ 15 తర్వాత నుంచి అమల్లోకి వచ్చింది. ఒక కస్టమర్ యాక్సిస్ బ్యాంకు విస్తారా కార్డు లిమిట్‌ను రూ. 5 లక్షల నుంచి రూ. 50 వేలకు తగ్గించింది. వీరిలో ఎక్కువశాతం మంది తమ క్రెడిట్ కార్డుల బిల్లును గడువులోపే చెల్లించినప్పటికీ లిమిట్ తగ్గడం గమనార్హం. ఈ అంశంపై సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని చెబుతున్నప్పటికీ, కారణాలు వేరే ఉన్నాయని కస్టమర్లు ఖరారు చేస్తున్నారు. కొద్ది రోజులయ్యాక సమస్య పరిష్కారం జరుగుతుందని తెలిపారు. మరికొంత మంది క్రెడిట్ కార్డు లిమిట్ ఏకంగా రూ. 7 లక్షల నుంచి రూ. 1.5 లక్షలకు తగ్గించడాన్ని పరిశీలిస్తే బ్యాంకుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొందరు కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్‌ను రూ. 75 వేల నుంచి రూ. 44 వేలకు తగ్గించేసింది. సాధారణ సమీక్షలో భాగంగానే లిమిట్‌ను తగ్గించినట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

Tags: Salary Cut, Job Loss, Customers, Axis Bank, Kotak Mahindra Bank, Credit Card

Tags:    

Similar News