బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు బ్యాంకులు బంద్
దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. నేడు, రేపు(గురు, శుక్రవారం) బ్యాంకులు బంద్ కానున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. అయితే.. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం గురువారం, శుక్రవారం(16, 17 తేదీల్లో) స్ట్రైక్ చేయాలని […]
దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. నేడు, రేపు(గురు, శుక్రవారం) బ్యాంకులు బంద్ కానున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది.
అయితే.. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం గురువారం, శుక్రవారం(16, 17 తేదీల్లో) స్ట్రైక్ చేయాలని నిర్ణయించింది. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. బ్యాంకర్ల సమ్మెతో చెక్క్లియరెన్స్ సహా.. మనీ ట్రాన్స్‌ఫర్స్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇదిలా ఉండగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు యూఎఫ్‌బీయూ పేర్కొంది.