పెట్రోలో, డీజిల్ ఉచితం.. ఆనందంలో వాహనదారులు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మిన్నటుతున్నాయి. రోజు రోజు పెరుగుతున్న ఇంధన ధరలు చూసి వాహనదారులు బేంబేలెత్తుతున్నారు. రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కులు చూసిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయంలో ఎవరైన ఉచితంగా పెట్రోల్ పోస్తే బాగుండూ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ ఛాన్స్ ఆరాష్ట్ర ప్రజలకు దక్కింది. ఉచితంగా మూడు లీటర్ల పెట్రోల్‌తో ఎంతో సంబరపడుతున్నారు ఆ వాహనదారులు. ఇంతకీ అది ఏ రాష్ట్రం.. ఎవరూ అంత గొప్ప పని […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మిన్నటుతున్నాయి. రోజు రోజు పెరుగుతున్న ఇంధన ధరలు చూసి వాహనదారులు బేంబేలెత్తుతున్నారు. రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కులు చూసిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయంలో ఎవరైన ఉచితంగా పెట్రోల్ పోస్తే బాగుండూ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ ఛాన్స్ ఆరాష్ట్ర ప్రజలకు దక్కింది. ఉచితంగా మూడు లీటర్ల పెట్రోల్‌తో ఎంతో సంబరపడుతున్నారు ఆ వాహనదారులు. ఇంతకీ అది ఏ రాష్ట్రం.. ఎవరూ అంత గొప్ప పని చేశారనే కదా మీ ఆలోచన.
కెరళలోని కసరగాడ్‌లో కుడుకోలి పెట్రోల్ బంకులో సోమవారం ఆటోరిక్షాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ దానమిచ్చారు. కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరలు పెరిగి, ఇటు ఇంధన ధరలు పెరిగి, సరిగ్గా వాహనాలు నడవక ఆర్థికంగా ఇబ్బందితో సతమతమవుతున్న ఆటోరిక్షాలకు ఉచితంగా ఇంధనం ఇచ్చారు. ఇలా ఇంధనం ఉచితంగా ఇవ్వడంతో ఆటోరిక్షా వాహన దారులు సంబరాల్లో మునిగిపోయారు. అసలు ఇధనం దానం చేయడానికి కారణం ఏంటీ అనేగా మీ ఆలోచన..
పెరిగిన ఇంధన ధరలు, లాక్ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఆటోరిక్షా డ్రైవర్లకు కాస్త ఉపశమనం కలిగించేందుకు వారికి మూడు లీటర్ల ఇంధనం ఉచితంగా అందించామని, ఇది కేవలం సాయం కోసం చేసిన దానమే గానీ, వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో కాదని పెట్రోల్ బంక్ మేనేజర్ సిద్దీక్ మదుమూలే తెలిపారు. ఆటోరిక్షాల కోసం పెట్రోల్ తరఫున సుమారు రూ.లక్షల విలువ చేసే ఇంధనాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే వచ్చిన మొత్తం 313 ఆటో రిక్షాలకు ఉచితంగా పెట్రోల్ కొట్టామని పేర్కొన్నారు. ఇంధన ధరలు సెంచరీ దాటుతున్న సమయంలో ఉచితంగా మూడు లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆటోరిక్ష వాహనదారులు ఆనందసాగరంలో మునిగిపోయారు.