బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం
కరోనా దెబ్బకు షేర్ మార్కెట్లు కుప్పకూలడంతో తీవ్రంగా నష్టపోయిన ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బలిజపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన అజయ్ బాబు(27) స్థానిక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల షేర్ మార్కెట్లు ఎన్నడు లేనంతగా భారీ నష్టాలను చవిచూడటంతో అజయ్ బాబు రూ. 20 లక్షల మేర నష్టపోయాడు. దీంతో త్రీవంగా కలత చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని […]
కరోనా దెబ్బకు షేర్ మార్కెట్లు కుప్పకూలడంతో తీవ్రంగా నష్టపోయిన ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బలిజపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన అజయ్ బాబు(27) స్థానిక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల షేర్ మార్కెట్లు ఎన్నడు లేనంతగా భారీ నష్టాలను చవిచూడటంతో అజయ్ బాబు రూ. 20 లక్షల మేర నష్టపోయాడు. దీంతో త్రీవంగా కలత చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన తల్లికి రాసిన లేఖను అతని పర్సు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: bank employee, suicide, ap news, vizianagaram district