నేను పాకిస్తాన్ వెళ్లను : బంగ్లా క్రికెటర్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మూడు దశల్లో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. త్వరలోనే మూడో దశలో భాగంగా ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా, మూడో దశ పర్యటనకు తాను పాకిస్తాన్ వెళ్లేది లేదని బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ ముష్పికర్ రహీమ్ ఆ దేశ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. కాగా ఏప్రిల్ 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. తొలి రెండు దశల్లో జరిగిన పర్యటనకు […]

Update: 2020-02-28 04:58 GMT

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మూడు దశల్లో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. త్వరలోనే మూడో దశలో భాగంగా ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా, మూడో దశ పర్యటనకు తాను పాకిస్తాన్ వెళ్లేది లేదని బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ ముష్పికర్ రహీమ్ ఆ దేశ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. కాగా ఏప్రిల్ 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది.

తొలి రెండు దశల్లో జరిగిన పర్యటనకు భద్రతా కారణాల దృష్ట్యా ముష్ఫికర్ పాకిస్థాన్ వెళ్లలేదు. ‘ఇప్పుడు కూడా పాకిస్తాన్‌లో అలాంటి పరిస్థితులే ఉన్నాయని తాను భావిస్తున్నానని..ఇది తన సొంత నిర్ణయమని’ ముష్పికర్ బంగ్లాకు చెందిన ఎన్టీవీతో చెప్పాడు. కానీ పాక్ పర్యటనకు వెళ్తున్న మిగతా క్రికెటర్లకు తన అభినందనలు తెలియజేశాడు. తన నిర్ణయాన్ని గౌరవించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు.

Tags:    

Similar News